
కమల్ హాసన్ నటించిన పుష్సక విమానం మూవీ మళ్లీ రిలీజ్ కానుంది. మాటలు లేని ఈ మూకీ మూవీ 5 క్రితం పెద్ద సంచలనమే సృష్టించింది. 1987లోని ఈ సైలెంట్ కామెడీ మూవీలో కమల్‌తోపాటు అమల నటించారు. మాటలు లేకుండా ప్రయోగాత్మకంగా తీసిన ఈ సినిమా ఆల్ టైమ్ ఫేవరేట్‌గా నిలిచింది. కమల్ హాసన్ ఈ సినిమాలో పలికించిన హావాభావాలు అద్భుతంగా నిలిచాయి. కడుపుబ్బా కామెడీతో నిండి ఉన్న మూవీ రీ రిలీజ్ కావడం ప్రేక్షకులకు కనువిందే అనుకోవచ్చు. ప్రయోగాత్మక సినిమాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో రూపొందిన మూవీ ఇది.