
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహా గణపతి ఒక రోజు ముందే భక్తులకు దర్శనం ఇచ్చాడు…ఈ ఏడాది 63 అడుగుల ఎత్తులో దశ విద్య మహా గణపతి గా దర్శనం ఇస్తున్నాడు.కుడి వైపు పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి , ఎడమ వైపు వీరభద్ర స్వామి, గణపతి కాళ్ళ దగ్గర కుడి వైపు వారాహి దేవి , ఎడమ వైపు సరస్వతి దేవి లు కోలువుదిరిడ్రు…రేపు ఉదయం 11 గంటలకు మొదటి పూజ తో ప్రారంభమై భక్తులకు దర్శనం ఇవ్వనున్న ఖైరతాబాద్ మహా గణపతి…వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూ లైన్ లు ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ సభ్యులు….భక్తులు ఎక్కువ గా రానున్న నేపథ్యంలో ప్రత్యేకంగా సిసి కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయనున్న పోలీస్ అధికారులు…ప్రభుత్వం తరపున ఖైరతాబాద్ దశ విద్య మహా గణపతి కి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న మంత్రులు , ఎం.ఎల్.ఏ లు…జి.హెచ్.ఎం.సి , వాటర్ వర్క్స్ , అన్ని శాఖల సమంవ్యయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు…ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు లు ఏర్పాటు..