
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సి.పి.ఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధపోరాట వారోత్సవాలు ముగింపు సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సి.పి.ఐ పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి డి..రాజా జాతీయ కార్యదర్శి నారాయణ ,జాతీయ నాయకులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
సురవరం సుధాకర్ రెడ్డి సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ సందర్భంగా మాట్లాడిన అంశాలు.
‘‘తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టులది మాత్రమే.పోరాటం 4500 మంది అమరులయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక్క శాతం వాటా లేని బీజేపీ సైతం సిగ్గులేకుండా విమోచన దినోత్సవాలు జరుపుకుంటున్నారు. బీజేపీ నేతలు హిందూ, ముస్లిం గొడవగా చిత్రీకరిస్తూ, చరిత్రను వక్రీకరిస్తున్నారు. విలీన దినోత్సవం జరపడం చేతకాక, దైర్యం లేక సమైక్యత వ్వారోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. సమైక్యత ఎవరికీ.. ప్రభుత్వం చెప్పాలి. సమైక్యత వారోత్సవాలు కమ్యూనిస్టీలు మేము ఒప్పుకోము. మహమ్మద్ ఆలీ జిన్నా గతంలో హిందుస్థాన్, పాకిస్తాన్ లు మాత్రమే ఉన్నాయన్నారు. అందుకు బ్రిటిష్ లు ఒప్పుకోలేదు. సిగ్గులేకుండా మహమ్మద్ అలీ జిన్నా ఒప్పందాన్ని నరేంద్ర మోడీ అమలుపరుస్తున్నారు. ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు మోడీ ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ మతోన్మాద విధానాల నుంచి దేశం బయట పడాలి. చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ హస్తం ఉంది. జగన్ తో ఉన్న ఒప్పందం ప్రకారమే చంద్రబాబు అరెస్ట్ జరిగింది. ముందు బాబు, తరువాత జగన్ పని పట్టి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. దేశం సర్వ మతాలతో కలిసి ఉండాలంటే దేశం నుంచి బీజేపీ ని పారద్రోలాల’’న్నారు.