
ఏపీలో కాంగ్రెస్‌కు మంచి స్కోప్ ఉందని గిడుగు పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా ఆయన తాజ్ కృష్ణకు వచ్చారు. ఏఐసీసీ పెద్దలతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజకీయాలపై ఏఐసీసీ పెద్దలతో చర్చించానన్నారు. ఏపీలో జగన్, బాబు, పవన్‌లు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. అందుకే ఆ పార్టీలకు ఏపీలో చోటు లేదన్నారు. పోలవరానికి జాతీయ హోదా కల్సించేలా చొరవ చూపాలని అన్నానన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మలని జగన్ చూస్తున్నారన్నారు. రాహుల్ గాంధీతో ఒక బహిరంగ సభ ఆంధ్ర ప్రదేశ్ లో ఉంటుందని రుద్రరాజు చెప్పారు. అమరావతికి ప్రియాంక్‌ను రావాలని కోరామనీ, అమరావతిలో తాము జరపబోయే సభకు ప్రియాంకను రావాలనీ, తిరుపతి సభకు ఖర్గే రావాలని కోరామన్నారు.