
నిన్న ఆసియా కప్ ఫైనల్లో తనకు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డుకింద దక్కిన 4.15లక్షల రూపాయలని అదే గ్రౌండులో పనిచేసే కార్మికులకి అక్కడే అందజేసాడు మహ్మద్ సిరాజ్.
పేద కుటుంబం నుండి వచ్చిన సిరాజ్ తనకు దక్కిన డబ్బుని అట్టిపెట్టుకోకుండా ఆర్థికంగా కుదేలైన శ్రీలంక ప్రజల జీవితం అర్థంచేసుకుని వారికి అందజేయడం తనకున్న గొప్ప మనసుని చాటుతుంది.
హైద్రాబాద్ రేతిబౌలిలో ఆటో డ్రైవర్ అబ్బాయి సిరాజ్. అతను చిన్నతనంలో లాల్ బహదూర్ స్టేడియమ్ లో ఫాస్ట్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. ఎందుకంటే అక్కడికి ఎవ్వరైనా వెళ్లి అడుకోవచ్చు కాబట్టి !!