
మధ్యప్రదేశ్లోని ఏకతాధామ్లో శ్రీ ఆదిశంకరాచార్యుల ఏకతా కంచు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహం తయారీ పని పూర్తయ్యంది. నర్మదా నదీ తీరంలోని ఓంకారేశ్వరంలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. సెప్టెంబర్ 18 ఉదయం 10.30 నిముషాలకు ఏకతా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆదిశంకరాచార్యుని బోధనలకు ప్రతి రూపంగా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆదిశంకరుడు హిందూమతాన్ని పునరుద్ధరించిన త్రిమతాచార్యులలో ఒకరని చెబుతారు. హిందూ మతంలోని కర్మకాండ, సన్యాసాన్ని తప్పుబడుతున్న కాలంలో ఆదిశంకరులు దాని ప్రాధాన్యత తెలియజేసేలా బోధనలు సాగించారు. చర్చలు చేశారు. ఉపన్యాసాలు ఇచ్చారు. ఇది హిందూ ధర్మ పునరుద్ధరణకు ఎంతో పనికి వచ్చింది.