
తెలంగాణకు ఏం చేశారో చెప్పేందుకు..
మీ పాలనలో ఒక్క విషయం లేదు కాబట్టే..
ప్రతిసారీ తెలంగాణ పై విషం చిమ్ముతున్నారా..??
రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తున్నా…
తెలంగాణపై ఎందుకింత కక్ష ??
తెలంగాణతో ఏమిటీ వివక్ష ???
అడ్డగోలుగా విభజన చేశారని ఒకసారి..
తల్లిని చంపి బిడ్డను బతికించారని మరోసారి..
తెలంగాణలో సంబరాలు జరగనే లేదని ఇంకోసారి..
ఇలా ఎన్నిసార్లు పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తారు..!!
మా దశాబ్దాల కల నెరవేరిన నాడు…
అంబరాన్ని అంటిన తెలంగాణ సంబరాలు
అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఆలంపూర్ దాకా
తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఉత్సవాలు కనిపించలేదా ?
నాటి ఉత్సవం నుంచి.. నేటి దశాబ్ది ఉత్సవం వరకూ
ప్రతి తెలంగాణ పుట్టిన రోజు… మా అందరికీ పండుగరోజు
గాంధేయ మార్గంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో
రక్తపాతం జరిగిందనడం ఆత్మగౌరవ పోరాటాన్ని
పార్లమెంట్ సాక్షిగా అవమానించడమే..
తలసరి ఆదాయంలో నెంబర్ వన్ గా నిలిచి..
సమున్నత శిఖరాలను అధిరోహించింది తెలంగాణ..
ఈ ప్రగతి ప్రస్థానాన్ని చూసి ఎందుకు ఓర్వలేకపోతున్నారు.
మీ సొంత రాష్ట్రం గుజరాత్ ను మించిపోయిందనేనా..
మీకు తెలంగాణపై గుండెలనిండా ఇంతటి ద్వేషం
ప్రధానమంత్రిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మీరే
రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియపై ఎలా నిందలు వేస్తారు?
ఇది…
ప్రాణత్యాగం చేసిన అమరులను…
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని…
కోట్లాది మంది ప్రజల మనసులను గాయపరచడమే…
పార్లమెంట్ లో ఇచ్చిన విభజన హామీలకు పాతరేసి
అబద్ధాల జాతర చేస్తామంటే సహించం… భరించం…
ఆనాడు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని దగా చేశారు.
మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు మోసం చేశారు.
తెలంగాణ పుట్టుకనే అవమానించిన బీజేపీకి
ఇక్కడ పుట్టగతులు ఉండవని తెలుసుకోండి
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఆపండి
అదే పార్లమెంట్ సాక్షిగా బేషరతుగా క్షమాపణలు చెప్పండి
ద్వేషం కాదు.. దేశం ముఖ్యం..
దేశం అంటే రాష్ట్రాల సమాహారం..
జై తెలంగాణ
జై భారత్