
బీజేపీ హయాంలో అనేక రాష్ట్రాల విభజన ఎంతో సాఫీగా సాగింది
కాంగ్రెస్ హయాంలో జరిగిన తెలంగాణ ఏర్పాటు ఎంత గందరగోళం మధ్య జరిగిందో అందరికీ తెలుసు
పెప్పర్ స్ప్రే ప్రయోగం జరగలేదా? పార్లమెంట్ డోర్స్ బంద్ చేయలేదా?
పార్లమెంట్ భవనం చరిత్ర గురించి చెబుతూ ప్రధాని ఆ విషయాలు గుర్తు చేశారు
కానీ కేసీఆర్, కేటీఆర్ కు విమోచన దినానికి, సమైక్యత దినానికి తేడా తెలియదు
80 వేల పుస్తకాలు చదివాను అని చెప్పుకునే వ్యక్తికి చరిత్ర తెలియదా?
బ్రిటిష్ నుంచి స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటంపై అనేక సినిమాలు వచ్చాయి
తెలంగాణ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటం మీద సినిమా తీస్తే తప్పేంటి?
పాకిస్తాన్ లో కలుస్తాం అని చెప్పిన నైజాం మీద యుద్ధం జరిగింది
ఆ తర్వాతే విముక్తి లభించింది. ఇది చరిత్ర. ఇన్నాళ్ళుగా తెలంగాణలో తర్వాతి తరాలకు ఈ చరిత్ర తెలీకుండా చేశారు
తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్రం ఎలా వచ్చిందో అందరికీ తెలియాలి
రజాకార్ల హింస గురించి చెప్పడానికి ఎన్నో ఘటనలు, ఉదంతాలు, ఉదాహరణలు ఉన్నాయి