
డెంగ్యూ వ్యాధితో వైష్ణవి అనే డాక్టర్ మృతి చెందిన సంఘటన నారాయణఖేడ్ మండల పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఖేడ్ మండలం వెంకటపురం గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ రాములు కూతురు డాక్టర్ వైష్ణవి మంగళవారం హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 10 గంట సమయంలో అకస్మాత్తుగా మృతి చెందారు.
వైష్ణవి నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేసి హైదరాబాదులోని పీజీ కోర్సు చేస్తున్నారు. గత మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో ఆస్పత్రిలో చికిత్స కోసం అడ్మిషన్ కాగా, మూడు రోజుల నుంచి చికిత్స కొనసాగుతుండగా ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందింది.