
ప్రముఖ పర్యావరణవేత్త, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సోదరుడు జలగం రామారావు మృతి చెందారు. ఆయన వయస్సు 93 ఏళ్లు. రామారావు ఇంటి వద్దే తుదిశ్వాస విడిచినట్లు కిమ్స్ ఆసుపత్రి ప్రెస్ రిలీజ్లో వెల్లడించింది. సెప్టెంబర్ 19వ తేదీ ఉదయం వేళల్లో ఆయన చనిపోయినట్లు ప్రకటించింది.
జలగం వెంగళరావు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు పర్యావరణ అంశాలపై సుదీర్ఘ పోరాటం చేశారు. పర్యావరణం కోసం పోరాటం చేసే పలు సంస్థలతో ఆయనకు అనుబంధం ఉంది. ట్యాంక్‌బండ్‌పై నెక్లెస్ రోడ్డును వ్యతిరేకించడంతోపాటు అక్కడ కమర్షియల్ నిర్మాణాలకు అనుమతించవద్దని అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి రామారావు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.