
మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వీడియో మెసేజ్ రిలీజ్
మల్కాజ్గిరి ప్రజల కోరిక మేరకు, నా కార్యకర్తల కోరిక మేరకు రాష్ట్రంలోని నా శ్రేయోభిలాషుల కోరిక మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను.
తప్పకుండా తగిన సమయంలో ఏ పార్టీలో చేరేది తెలియజేస్తాను.
ఇంతవరకు మీ అందరి సహకారానికి నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మరిచిపోను.
మల్కాజ్గిరి ప్రజలకు రాష్ట్రంలోని నా శ్రేయోభిలాషులందరికీ అండగా ఉంటాను.
నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తాను.. దేనికి లొంగే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాను.