
మోడీ ప్రభుత్వం తెచ్చిన మహిళా బిల్లు,
జన గణన, డి లిమిటేషన్ అంశాల దృష్ట్యా 2028-29 కాలంలో కావచ్చు.
కాబట్టి ఇప్పటికైతే మహిళలకు ఈ ఎన్నికలలో 2023..24
సీట్లలో ఇయ్యనవసరం లేదు అని రాజకీయ పార్టీలు అనుకోకుండా, ఇప్పటినుండి రానున్న ప్రతి ఎన్నికలలోను ఆ మహిళా ప్రాధాన్యతా ప్రాతినిధ్యాన్ని సాధ్యమైనంత వరకు తమ వైపు నుండి చూపి, నిజాయితీని నిరూపించుకుంటే, మహిళా బిల్లుకు నిజమైన విలువ ఇచ్చినట్లు సమాజం అభిప్రాయపడతది..
అట్లా అయినప్పుడే తెలంగాణల ఇప్పటికే 100కు పైగా అసెంబ్లీ సీట్లు ప్రకటించిన టీఆర్ఎస్, అందులో 6 స్థానాలు కేవలం మహిళలకు ఇచ్చి, మహిళా రిజర్వేషన్ పై గొంతు పెట్టి , మోసపూరితంగా అరుస్తోందన్న అనుమానం తెలంగాణ మహిళలకు కలగదు.
నిజంగా మహిళా రిజర్వేషన్ పై బీఆర్ఎస్ అధిష్టానం తన చిత్తశుద్దిని ప్రకటించాలనుకుంటే సీట్ల కేటాయింపు విషయంలో పున సమీక్ష చేయాలి.
అలా చేయగలితే అప్పుడు అధికార పార్టీ నిర్ణయంతో తెలంగాణలోని ప్రతిపక్షాలపై ఒత్తిడి పెరిగి, ప్రధాన పార్టీలన్నీ కూడా అధిక శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సిన నిర్భంధం ఏర్పడుతుంది.
ప్రధాని మోడీ తెచ్చిన మహిళా బిల్లుకు అన్ని రాజకీయ పార్టీల కార్యాచరణ ఇప్పటి నుండి ప్రారంభమై సార్థకత సాధిస్తది.
