
బాలీవుడ్ హిరోయిన్ పరిణీతి చోప్రా పెళ్లి చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె వివాహం అయ్యింది. చిన్నప్పుడు క్లాస్మేట్స్ అయిన వీరిద్దరు ఇపుడు జీవితంలో ఒక్కటయ్యారు. వీళ్ల పెళ్లి గురించి చాలా కాలంగా బాలివుడ్లో గుసగుసలు వినిపించాయి. ఇప్పటి వరకు వీటిపై ఏ కామెంట్స్ చేయని ఈ జంట ఇపుడు తమ పెళ్లి గురించి కూడా ఎలాంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు. కానీ ఆదివారం ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీళ్లిద్దరు ఒక్కటయ్యారు. సమీప బంధువులు, మిత్రులు, కొందరు రాజకీయ నేతలు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాగ్, నీతి (రాఘవ్ ఛద్దా, పరిణీతి)ల పెళ్లి వేడుక మూడు రోజుల పాటు సాగినట్లు సమాచారం. శనివారం సంగీత్ జరిగింది. పంజాబీ సింగ్ నవ్రాజ్ హన్స్ సంగీత్‌లో తన పాటలతో అతిధులను అలరించారు. వెడ్డింగ్ కాస్టూమ్స్‌ని మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. కొంత కాలం డేటింగ్ తర్వాత మే 13న ఢిల్లీలో వీళ్ల ఎంగేజ్మెంట్ అయ్యింది. మ్యారేజీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, శివసేన లీడర్ ఆదిత్య థాక్రే అటెండ్ అయ్యారు.