
ఖమ్మం కాంగ్రెస్ పార్టీ లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్
ఈరోజు ఖమ్మం జిల్లా రాజకీయ ముఖ చిత్రం మార్పుకు నాంది ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు చాలా పెద్ద కంచుకోట అని మనం రాష్ట్ర కాంగ్రెస్ కి చూపించాం…అందుకు ఈరోజు మరో ఇద్దరు నాయకులు మనకు తోడు అయ్యారు
మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ లో చేరినారు.
చాలా మంది నాయకులు, కార్యకర్తలు కష్టపడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలవడానికి కష్టపడ్డారు. కార్యకర్తల కష్టం, మీ చెమట వలనే నేడు కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్నది
రాష్ట్రంలో వనరులు, ప్రజాస్వామ్యం అన్ని ప్రమాదంలో పడినాయి..మనం రాష్ట్రం తెచ్చుకుంది వనరులు, ఉద్యోగాలు అన్ని పేదలకు చెందాలని, సోనియా గాంధి గారు రాష్ట్రాన్ని ఇచ్చారు..కానీ నేడు అలా జరగడంలేదు. మోసపూరిత హామీలతో బిఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ మభ్య పెడుతున్నాడు
రాష్ట్ర ప్రజలందరినీ తాకట్టు పెట్టి 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు.తొమ్మిదిన్నర సంవత్సరాల బడ్జెట్, 5 లక్షల కోట్ల రూపాయల అప్పు వనరులు సంపద మొత్తం లూటీ చేశారు.అందుకే అందరికీ అన్ని వర్గాలకు న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి
ప్రతి పేదవాడి ఇండ్లు కట్టుకోవాలి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలిరైతులకు వరికి క్వింటాల్‌కు మద్దతు ధరపై అదనంగా 500 రూపాయల బోనస్ ఇవ్వాలి అన్నా, ఎకరానికి 15 వేల రైతు భరోసా కావాలన్న కాంగ్రెస్ అధికారంలోకి రావాలి
ఆరోగ్యశ్రీ 10 లక్షలు వరకు పెంచాలి అన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలిప్రతి పేదవాడు చదువుకోడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి
మహిళల సాధకరిత కోసం కాంగ్రెస్ అధికారంలోకి రావాలి…గ్యాస్ ధర తగ్గాలి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి
అంతే గానీ కెసిఆర్ లాగా రాష్ట్ర సంపద దోపిడీ కోసం అధికారంలోకి రావాలని అనుకోడం లేదు…రాష్ట్ర సంపద, వనరులు పేదలకు పంచడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అనుకుంటున్నాను
కాంగ్రెస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ సాదరంగా స్వాగతం చెపుతూ…అందరం కలిసి పని చేస్తాం. అని మీకు సభా వేదికగా చెపుతున్నాను..ఈరోజు వరుణుడు కూడా మనలను ఆశీర్వదించారు.