
రైతులకు రుణాల మాఫీని బ్యాంకులకు డబ్బు చెల్లించడం ద్వారా కాకుండాఆ చెక్కుల రూపంలో అందచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 25, 50 వేల రూపాయల రుణ మాఫీని కొంత మేరకు చేసిన ప్రభుత్వం 75 వేల, లక్ష రూపాయల రుణమాఫీని చేయాల్సి ఉంది. అయితే చెక్కుల రూపంలో ఇస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా రైతును కలిసి అందజేస్తారు కాబట్టి ఎన్నికల్లో లబ్ది చేకూరే అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.