
మాజీ మంత్రి, బీఆర్ఎస్ బహిషృత నేత జూపల్లి కృష్ణారావు ఎట్టకేలకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గురువారం ఢిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. వాస్తవానికి జులై 30న కొల్లాపూర్లో జరిగే ప్రియాంకా గాంధీ సభలో ఆయన అట్టహాసంగా పార్టీలో చేరాలనుకున్నారు. కానీ వర్షాల కారణంగా ఆ సభ రద్దైంది. దాంతో కార్యకర్తల ఒత్తిడి మేరకు ఆయన ఢిల్లీలో ఖర్గే సమక్షంలో సాదాసీదాగా పార్టీలో చేరారు.