
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. బయోమెట్రిక్ విధానం పాటించనందున పరీక్షలు రద్దు చేయాలని ఎన్ఎస్యూఐ నేత బల్మూరి వెంకట్ పిటిషన్ వేశారు. పిటిషన్‌పై ఇరు వాదనలు పూర్తయ్యాయి. కాగా హైకోర్టును తీర్పును రిజర్వ్ చేసింది. గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్‌ను రాసిన అనేక మంది అభ్యర్థులు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.