
సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. గత వారం రోజుల నుంచి ఆయనకు జ్వరంతోపాటు దగ్గు కూడా ఉందని ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. కేసీఆర్ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. కొద్ది రోజుల్లో ఆయన సాధారణ స్థితికి వస్తారని డాక్టర్లు చెప్పినట్లు కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు.