
సెప్టెంబర్ 28 తారీకు భారీ వర్షాలు కురిసే అవకాశం..
28 న హైదరాబాద్ కి ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు..
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల మరియు ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఈ రోజు భారీ వర్షములు రాష్ట్రంలోని కొన్ని (తూర్పు , పశ్చిమ) జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు నిర్మల్ నిజామాబాద్ ఖమ్మం నల్గొండ సూర్యాపేట సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిచే అవకాశం ఉంది
దీంతో ఈ 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారి చేసిన వాతావరణ శాఖ అధికారులు..
రాగల మూడు రోజులు ఉరుములు , మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
ఈరోజు నగరంలో తెలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
నిన్న దక్షిణ చత్తీస్గడ్& పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం, నైరుతి ఉత్తరప్రదేశ్ నుండి చత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ద్రోణి ఈరోజు బలహీనపడినవి.
ఈరోజు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం ఏర్పడింది
ఈ ఆవర్తనం సగటు సముద్రం మట్టం నుండి 2.1 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.