
కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన విడతల వారిగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) మీటింగ్ పెట్టాలని ఏఐసీసీని కోరామన్నారు. ఈ మీటింగ్ తర్వాత ఫస్ట్ లిస్ట్ విడుదలవుతుందని ఆయన తెలిపారు. తర్వాత రెండు, మూడవ జాబితాలు కూడా విడుదల చేస్తామని చెప్పారు. ఎలాంటి ఇబ్బంది లేని స్థానాలను మొదటగా ప్రకటిస్తామన్నారు. ఇద్దరు, ముగ్గురు పోటీ పడే చోట్ల సర్వేల ఆధారంగా సీఈసీ నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ అన్నారు. ఈ ప్రక్రియ పూర్తవగానే బస్సు యాత్ర మొదలుపెడతామని చెప్పారు. తమ సర్వేలో బీఆర్ఎస్కు 25 సీట్లు దాటవని తేలిందన్నారు. బీజేపీ, ఎంఐఎంలు సింగిల్ డిజిట్‌కు పరిమితమవుతాయన్నారు.