
రేపు సాయంత్రం మైనంపల్లి కాంగ్రెస్ లో చేరుతారని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. మైనంపల్లి ఫ్యామిలీ కి రెండు టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ చేసిందన్నారు. వేముల వీరేశం చేరిక తొందరలోనే ఉంటుందని చెప్పారు. రేవంత్ బుధవారం మీడియాతో చిట్ఛాట్ చేశారు. అందులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. పార్టీ లో చేరడానికి అందరికీ ఆహ్వానం ఉందనీ, టిక్కెట్ స్థానిక పరిస్థితులను బట్టి పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బీసీ లకు 34 సీట్లు ఇవ్వాలని 100శాతం ప్రయత్నిస్తున్నామనీ, బీఆర్ఎస్ కంటే బీసీ లకు ఎక్కువ సీట్లు ఇస్తామని తెలిపారు. అన్ని సమాజికవర్గాల వారు మా పార్టీ లో బలమైన వాదన వినిపించారన్నారు. వారి తరుపున సెంట్రల్ ఎలక్షన్ కమిటీ లో నా వాదన ఉంటుందని వివరించారు. కాంగ్రెస్ లో ఎంతో మంది బీసీ లు పార్టీ కి పీసీసీ ఛీఫ్ గా చేసారనీ, ఒక్కరైనా బీఆర్ఎస్ కు బీసీ అధ్యక్షుడు అయ్యాడా అని రేవంత్ ప్రశ్నించారు.