
చంద్రబాబు అరెస్ట్ పై రేవంత్ కామెంట్స్..
చంద్రబాబు అరెస్ట్ ఏపీకి పరిమితమైన అంశం కాదు
చంద్రబాబు జాతీయ స్థాయి వ్యక్తి.
చంద్రబాబు అంత అనుభవం ఉన్నవాళ్లు వేళ్లపై లెక్కపెట్టవచ్చు
చంద్రబాబుకి మద్దతుగా నిరసన తెలిపే వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళకి హక్కులు లేకుండా చేస్తారా?
నిరసన తెలియచేసే వాళ్ళని అడ్డుకుంటే ప్రజలు చెంపలు వాయిస్తారు
అవసరం అయితే వినతిపత్రం తీసుకొని అనుమతి ఇవ్వాలి తప్పా… తిరస్కరించడం తప్పు
ఎన్నికల్లో సెటిలర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడుతారు
పన్నులు కట్టించుకొని, ఓట్లు వేయించుకొని మా రాష్ట్రం సమస్య కాదని అంటే ప్రజలు మూతి పండ్లు రాలుతాయి
కేటీఆర్ కి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి. వాళ్ళని మాత్రం పక్క రాష్ట్రం ప్రజలు అంటాడు
ఎవరు ఏ సమస్య పై అయినా ఎక్కడైనా నిరసన తెలపవచ్చు
ఐటీ రంగం వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తా అంటే ఒప్పుకోకపోవడానికి హైదరాబాద్ కేటీఆర్ జాగీరా?
కేసీఆర్ ఢిల్లీ వెళ్లి తెలంగాణ అంశంపై ప్రొటెస్ట్ చేయవచ్చు.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇక్కడి ఐటీ వాళ్ళు నిరసన తెలియచేస్తే అడ్డుకోవడం ఎంటి?