
“నాట్ బిఫోర్ మీ” అంటే ఏమిటి ? చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో “నాట్ బిఫోర్ మీ” అని తరచూ వినిపిస్తోంది. ఐతే “నాట్ బిఫోర్ మీ” అనేది లీగల్ టెర్మినాలజీలో ఉపయోగించే పదం. ఒక కేసు ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నప్పుడు.. ఈ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అటువంటి సందర్భాలలో, ఉన్నత న్యాయస్థానం తన తీర్పును వెలువరించే వరకు లేదా సంబంధిత విషయం పరిష్కరించే వరకు ఈ అంశాన్ని “నాట్ బిఫోర్ “గా రిజిస్టర్ చేస్తుంది కోర్టు. న్యాయవాదుల్లో చాలామందికి సీనియర్లు, జూనియర్లు, బంధువులు, తెలిసిన వాళ్ళు, వాళ్లకు తెలిసిన వాళ్ళు, సన్నిహితులు, స్నేహితులు ఉంటారు. ఒక్కసారి ఎవరైనా న్యాయమూర్తి ఐతే మాత్రం గతంలో తమతో సన్నిహితంగా మెలిగిన అడ్వకేట్ల కేసులను విచారణకు చేపట్టే పరిస్థితి వచ్చినప్పుడు తమకు సంబందించిన వారికి ప్రయోజనం కలిగే తీర్పులు ఇచ్చే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఇలాంటి అనుమానాలకు ఆస్కారం ఇవ్వకుండా ఉండడం కోసం తమ వద్దకు వచ్చే తమకు సంబంధించిన వారి కేసులను విచారణకు స్వీకరించకుండా జడ్జిలు విధించుకున్న నియమమే “నాట్ బిఫోర్ మీ”. సుప్రీం కోర్టులో, ఏ ఇతర రాష్ట్ర హైకోర్టుల్లో లేని నాట్ బిఫోర్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉంది.