
మండలంలో ఇప్పటికే జ్వరాలతో పలువురు మృతి
ఒక్క రోజు జ్వరంతో నాలుగేండ్ల చిన్నారి మృతి
చెందింది. వివరాల్లోకి వెల్తే..
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం లోని ఒడిస్సా కాలనీలో బోయి అజయ్ మరియమ్మ దంపతుల ఎకైక కుమార్తె అక్షర (4) విష జ్వరంతో మృతి.
తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం మద్యాహ్నం అక్షరకు జ్వరం రావడంతో ఏటూరు నాగారంలోని ఓ ప్రవేటు హాస్పిటల్ కి తీసుకెల్లారు.
ట్రీట్మెంట్ జరుగుతుండగానే పరిస్తితి విషమించడంతో, మెరుగైన ట్రీట్మెంట్ కోసం మణుగూరు తీసుకెళ్లే క్రమంలో మార్గ మధ్యలో అక్షర చనిపోయిందని తల్లిదండ్రులు తెలిపారు.