
ఇయ్యాల..మోడీ వచ్చి బీఆర్ఎస్ ది కుటుంబ పార్టీ అని
అన్నడట..! అవును మాది..బరాబర్ పక్కా కుటంబ పార్టీయే..!
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే..!
మా నాయకుడు కేసీఆర్ గారే కుటుంబపెద్ద..!
తెలంగాణే నా సొంత కుటుంబం అనుకున్నడు కాబట్టే..
ఇంటికి పెద్దకొడుకై..అవ్వలకు ఆసరాగా నిలిచి
2వేల పెన్షన్ అందిస్తున్నడు..!
కంటి చూపు మసకబారి..జారి కిందపడి
కాలో..చేయో విరిగి మంచానపడే కష్టం రాకూడదని
పెద్దమ్మలకు..పెద్దయ్యలకు కంటి పరీక్షలు చేసి కళ్లజోడు
అందిస్తున్నడు..!
మేనమామై..లక్ష నూటపదహార్ల కానుకిచ్చి
లక్షణంగా లగ్గం చేస్తున్నడు..!
అక్కా చెల్లెళ్లు బిందెలు పట్టుకొని నీళ్ల కోసం
మైళ్ల దూరం నడిచే కష్టం తీర్చాలని
ఇంటింటికి నల్లాపెట్టి నీళ్లు ఇచ్చిండు..!
అన్నలాగా..ఆడబిడ్డకు పుట్టింటి ప్రేమతో పురుడుపోసి
కేసీఆర్ కిట్‌ను ను అందిస్తున్నడు..!
గురుకులాలు పెట్టి…జిల్లాకో మెడికల్ కాలేజీ కట్టి
డాక్టర్లు..ఇంజనీర్లు కావాలన్న పిల్లల కలల్ని నిజం చేస్తున్నడు..!
కుటుంబంపైన ఆపేక్ష..ప్రేమ వుంది కాబట్టే
ఒక రైతుబంధు..రైతుబీమా..దళితబంధు ఎన్నో
మానవీయ పథకాలు రూపుదిద్దుకున్నాయి…!
-గిరిజన వర్శిటీ తెలంగాణ హక్కు..! తొమ్మిదిన్నర ఏండ్లు తొక్కిపెట్టి..
విభజన చట్టంలోని హామీని తుంగలో తొక్కి..ఆదివాసి పిల్లలకు అన్యాయం చేసి.. ఇప్పుడేదో ఉద్ధరించినట్టుగా ఫోజులు కొడుతున్నడు..!
అన్నదాత అప్పులు మాఫీ చేసి
జైకిసాన్ ప్రభుత్వం మాది..!
కార్పొరేట్ దోస్తులకు 14 లక్షల కోట్ల
రుణాలను రద్దుచేసిన ..నై కిసాన్ సర్కారు మీది.!
కర్షకుల రక్తం కండ్ల జూసిన
రైతుహంతక రాజ్యం మీది..!