
చిరు వ్యాపారం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారాయన. గత 30 ఏళ్లుగా దాన్ని అభివృద్ధి చేసి కుటుంబాన్ని మంచి పొజీషన్కు తీసుకువచ్చారు. అలాంటి వ్యక్తికి వ్యాపార విరమణ సన్మానం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు. ఆత్మకూరులో వెలిసిన వ్యాపార విరమణ పోస్టర్లు స్థానికులను బాగా ఆకర్షించాయి. ఉద్యోగ విరమణే కాదు, వ్యాపార విరమణ కూడా లెక్కే కదా అంటూ చర్చించుకున్నారు.
ఆదివారం సాయంత్రం ఆత్మకూరులో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వ్యాపార విరమణ చేస్తున్న సింహాద్రి రమేష్ దంపతులను కుటుంబ సభ్యులు, స్నేహితులు సన్మానించారు. గత 30 ఏళ్లుగా రమేష్ బజ్జీ సెంటర్ను నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చిన ఆయన కృషిని వాళ్లు అభినందించారు. సభ అనంతరం ఆహుతులకు అల్పాహారం అందించి, ఊరేగింపు కూడా తీయడం విశేషం.