
గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిగారి ప్రెస్ మీట్ స్క్రోలింగ్ పాయింట్స్…
మోదీ మహబూబ్ నగర్ పర్యటనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటిస్తారని అనుకున్నాం.
తెలంగాణకు ఉద్యోగ అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటారని ఆశించాం
ఐటీఐఆర్ కారిడార్ ను పునరుద్దరిస్తారని ఆశించాం
బయ్యారం ఉక్కు కర్మాగారంతోపాటు విభజన హామీలను అమలు చేస్తారని ఆశించాం
వీటిలో ఏ అంశాలను ప్రధాని ప్రస్తావించలేదు.
పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ గతంలో ఇచ్చిన హామీలే.
మోదీ తెలంగాణపై వివక్ష చూపుతున్నారు.
విభజన హామీలు అమలు చేయకపోవడంతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది.
సొంత భజన చేసుకుని ఓట్లు దండుకునే ఆలోచన బీజేపీది
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే మోదీ తప్పు పట్టారు.
అలాంటి మోదీ సభను పాలమూరు జిల్లాలో నిర్వహించినందుకు డీకే అరుణ, జితేందర్ రెడ్డి జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.
మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చు..
మోదీ సభకు పరోక్షంగా సహకరించిన కేసీఆర్ కూడా దోషినే..
కేసీఆర్ కుటుంబం అవినీతిని బయటకు తీస్తామని ప్రజలకు మోదీ ఎందుకు హామీ ఇవ్వలేదు
కాళేశ్వరం, లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించలేదు.
బీజేపీ, బీఆరెస్ చీకటి ఒప్పందం ఏంటో ప్రజలకు అర్ధమైంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే మోదీ పర్యటనలు
కాంగ్రెస్ బలంగా ఉన్నచోట ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారు.
మోదీ పరోక్షంగా బీఆరెస్ ను గెలిపించాలని చూస్తున్నారు.
విభజన హామీలపై మోదీ స్పష్టత ఇవ్వాలి.
బిల్లా రంగాలు కాంగ్రెస్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, మైనారిటీ రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్
2004 నుంచి 2014 వరకు ఇచ్చిన ఆరు హామీలను కాంగ్రెస్ అమలు చేసి చూపింది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఈ పథకాలను అమలు చేసి చూపాము.
ఈ బిల్లా రంగాలకు రాజ్యాంగం విలువ తెలియదు.
ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని బిల్లా రంగాలు… ఇతర రాష్ట్రాల్లో అమలు చేయాలని మాట్లాడుతున్నారు.
బిల్లా రంగాలకు సూటిగా సవాల్ విసురుతున్నా..
2004 నుంచి 2014 వరకు మేం ఇచ్చిన హామీల అమలు పై చర్చకు రండి..
20014 నుంచి 2023 వరకు మీరు ఇచ్చిన హామీల అమలుపై చర్చకు మేం రెడీ
మా పదేళ్ల పాలన.. మీ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?
సన్నాసి లాజిక్కులు, సన్నాయి నొక్కులు మానుకోండి..
రాష్ట్రాల ఆదాయం, ప్రజల అవసరాలనుబట్టి పథకాలు ఉంటాయి.
మీరు ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు.
కాంగ్రెస్ లో బహునాయకత్వం ఉంటే తప్పేంటి?
బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు ఇస్తే తప్పేముంది
అయినా రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్ణాటకలో సీఎం లు మారారా?
మాట ఇస్తే అమలు చేసే పార్టీ కాంగ్రెస్
ఆనాడు అమలు చేసాం.. ఇప్పుడూ ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తాం.
కాంగ్రెస్ ను ప్రశ్నించే నైతికత బిల్లా రంగాలకు లేదు.
తెలంగాణ సమాజం కేసీఆర్ ను నమ్మదు.. క్షమించదు.