
కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి నామినేషన్ కోసం డబ్బును కేసీఆర్ పూర్వికుల గ్రామం కోనాపూర్ కు చెందిన గ్రామస్థులు అందజేశారు. కేసీఆర్ ను గద్దె దించేందుకే గ్రామస్తులమంతా కలిసి నామినేషన్ డబ్బులు అందజేశామని గ్రామస్థులు పేర్కొన్నారు. పదేళ్లుగా గుర్తురాని కొనాపూర్ ఇవాళ గుర్తొచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.