
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. టీజేఎన్యూ, ఆర్టీసీ జేఏసీలు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బస్సులు నిలిపి వేయాలని పిలుపునిచ్చాయి. గవర్నర్కు పంపిన బిల్లుకు వెంటనే ఆమోదం పొందేలా చూడాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఆర్టీసీ బిల్లు ప్రతిపాదనను గవర్నర్ ఈ నెల 2న ప్రభుత్వం పంపింది. అప్పటికే గవర్నర్ తమిళసై పుదుచ్ఛేరికి వెళ్లిపోయారు. తిరిగి ఆమె 8వ తేదీన రాష్ట్రానికి వస్తారు. అసెంబ్లీ సెషన్ ఆదివారంతో ముగియనుంది. కాబట్టి తమ విలీనం ఏమవుతుందోనని ఆర్టీసీ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. దాంతో వాళ్లు శనివారం ఆందోళనకు శ్రీకారం చుట్టారు. బస్సులను డిపోల బయటకు రానీయకుండా గేట్లకు తాళం వేసి అక్కడే ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో అన్ని డిపోల వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రయాణీకులు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు.