
కోకాపేటలో భూములు రికార్డు స్థాయిలో ధర పలకడంతో ప్రభుత్వం ఇపుడు బుద్వేల్ భూములపై దృష్టి సారించింది. ఇక్కడ ఉన్న 199 ఎకరాల స్థలాన్ని అమ్మాకానికి పెడుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. బుద్వేల్‌లో మొత్తం 14 ప్లాట్లను అమ్మాకానికి పెట్టారు. ఇవి ఒక్కొక్కటి 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాల వరకు ఉంది. హెచ్ఎండీఏ ఎకరాకు కనీస ధరను 20 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. ఆరో తేదీన ప్రీబిడ్ సమావేశం ఉంది. ఎనిమిదో తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుంది. ఈ నెల 10న వేల నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. ఈ వేల ద్వారా కనీసంగా మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.