
ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ఆర్టీసీ కార్మికుల గురించి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఈ అసెంబ్లీ సెషన్లోనే ఒక రూపు తీసుకుంటుందని అందరూ భావించారు. కానీ ఆర్టీసీ కార్మికులకు టెన్షన్ తప్పడం లేదు. ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన తీర్మాణాన్ని గవర్నర్ అమోదం కోసం పంపారు. అయితే గవర్నర్ నుంచి ఇంత వరకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. దాంతో విలీనం బిల్లు రూపం సంతరించుకుంటుందా లేదా అనేది అనుమానంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. మరి ఈ లోపున గవర్నర్ ఆమోదం వస్తుందా? లేదా అసెంబ్లీ సమావేశాల్ని ఒక రోజు పొడిగించి గవర్నర్ పర్మీషన్ సాధిస్తారా అని తేలాల్సి ఉంది. ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం రంగంలోకి విలీనం చేశారు. గవర్నర్ అక్కడ ప్రాసెస్ ఏ విధంగా జరిగిందో అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.