
మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ శని వారమే షురూ కానున్నది. సోనియా జన్మ దినం సందర్భంగా మహాలక్ష్మి పేరిట దీన్ని అమలు చేయనున్నారు. ఎన్నికల హామీగా కాంగ్రెస్ ఇచ్చిన అరు పథకాల్లో మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణం ఒకటి. ఆరు హామీల్లో అమలు చేస్తున్న పథకం ఇదే మొదటిది.
పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు అవుతుంది. సూపర్ లక్సరీ, రాజధాని తదితర బస్సుల్లో మాత్రం టికెట్ తో ప్రయాణం చేయాలి.
ఉచిత ప్రయాణానికి ఆర్టీసి మహాలక్ష్మి బస్ ని సిద్ధం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఈ బస్ ని ప్రారంభిస్తారు. ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం ఏటా రూ. 2,200 కోట్లు ఆర్టీసీకి చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.