
తాను ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే బిల్లును లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు గవర్నర్ ట్వీట్ చేశారు. ఆర్టీసీ సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు తనకు బాధ కలిగించిందన్నారు. దీని వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందన్నారు. తాను గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినపుడు వారికి మద్దతుగా ఉన్నాననీ, ఇపుడు కూడా వాళ్ల పక్షమే వహిస్తానన్నారు. అందుకే తాను కార్మికులకు పూర్తి స్థాయి ప్రయోజనాలు కలిగించే అంశాలు బిల్లులో ఉన్నయో లేదో పరిశీలిస్తున్నానన్నారు. గవర్నర్ తమిళసై ఈ అంశాలపై చర్చించేందుకు ఆర్టీసీ యూనియన్ నేతలను వీడియో కాన్ఫరెన్స్‌కు పిలిచారు.