
హిందూత్వ ప్రయోగశాలలో మండుతున్న మణిపూర్
మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింస, విద్వేష రాజకీయాలు యావత్తు దేశాన్నీ కుదిపేస్తున్నాయి. హింసాత్మక మూకలు నిస్సహాయులైన ముగ్గురు స్థానిక ఆదివాసీ స్త్రీలను చేసి ఊరేగించిన సంఘటన విద్వేష రాజకీయాల వికృతత్వాన్ని బయటపె పెట్టింది. మనుషులను క్రూర మృగాలుగా మార్చే ఇంతటి విద్వేషం సాధ్యమేనని హిందుత్వ రాజకీయ లాబొరేటరీ మరొకసారి రుజువు చేసింది. ముగ్గురు ఆదివాసీ మహిళలను మే
4న దిగంబరులను చేసి, వారి మర్మావయవాలను తాకుతూ, ఊరేగించి ఆపై అత్యాచారం చేసిన సంఘటన మనందరినీ దిగ్భాంత పరిచింది. ఈ నంఘటన జరిగిన నెలా వదిహేను రోజులకు గానీ అంటే జూలై 19 వరకూ దేశానికి తెలియలేదు. తమను హింసాత్మక మూకలకు అప్పగించిందీ, విద్వేష మూకల వికృత క్రీడలకు నహకరించింది పోలీసులేనన్నది బాధిత మహిళల ఫిర్యాదు.
జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఏ ఫలితమూ లేకపోయింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ తీరు కూడా అలాగే ఉంది. మే 3న హింస మొదలైతే జూన్ 4న గానీ కారణాలను అన్వేషించడానికి హోం మంత్రిత్వశాఖ ఒక కమిటీని నియమించలేదు. మెజారిటీ ప్రజలైన మెయితీలకు మైనారిటీ ప్రజలైన కుకీ, నాగా, జోమి తెగల వారి మధ్య ఏ రకమైన చర్చలకు ఆస్కారం లేకుండా దాడులు, గృహ దహనాలు పెచ్చరిల్లి పోతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు కూడా జరిగాయి. అనేక చర్చిలు ధ్వంసం అయ్యాయి. గ్రామాలకుగ్రామాలు కాలి బూడిదయ్యాయి. వేల నంఖ్యలో ప్రజలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
సామాజిక జీవనం విభిన్నం
మణిపురీల సామాజిక జీవనం దాని భౌగోళిక స్వరూపంలాగే ఇతర ఈశాన్య రాష్ట్రాల సామాజిక జీవనం కన్నా భిన్నమైనది. మణిపూర్‌లో తొంభై శాతం కొండప్రాంతం కాగా పదిశాతం చదునుగా ఉండే లోయ ప్రాంతం. లోయ ప్రాంతం రాష్ట్ర విస్తీర్ణంలో పది శాతం ఉంటుంది. మిగతాదంతా పర్వత ప్రాంతమే. ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలు ప్రధానంగా మెయితీ, నాగ, కుకీ, జోమీ తెగలకు చెందినవారు. రాష్ట్ర జనాభాలో మెయితీలు 53 శాతం. వీరు లోయ ప్రాంతంలో నివాసం ఉంటారు. వీరిలో అత్యధికులు వైష్ణవులైన హిందువులు. అల్ప సంఖ్యలో ముస్లింలు కూడా ఉన్నారు. మెయితీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలమైన వర్గం. ఓ.బి.సి, ఎస్సీ జాబితాలో ఉన్న వీరు చదువు, ఉద్యోగాల్లో ముందు ఉన్నారు.
జనాభాలో నలభై శాతం ఉన్న కుకీ, నాగా,జోమీ తెగల ప్రజలు కొండ ప్రాంతంలో ఉంటారు. వీరంతా ఎస్.టి జాబితాలో ఉన్న ఆదివాసులు. వీరిలో అత్యధికులు క్రైస్తవులు. ఈ రెందు సమూహాల మధ్య చారిత్రకంగా కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ వాటిని అవకాశవాద, విభజన రాజకీయాలకు వాడుకున్నది మాత్రం హిందూత్వవాదులే. మెజారిటీ ప్రజలైన మెయితీలకు చారిత్రకంగా అన్యాయం జరిగిందనీ, కేవలం 10 శాతం భూభాగానికే వారు పరిమితమయ్యారనీ, కొన్నాళ్ళకు మైనారిటీలైన నాగా, కుకీ, జోమీలు మెజారిటీగా మారి హిందువులు మైనారిటీగా మారిపోతారనీ, వారి సంస్కృతి, సంప్రదాయాలను కోల్పోతారనీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ విషప్రచారంతో పాటు ఇతర వదంతులు కూడా హింసాకాండకు తోడ్చడ్డాయి. మెయితీ మహిళలను కుకీ తెగల వారు రేప్ చేసారనే అసత్య ప్రచారం వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల్లో విరివిగా ప్రచారం అయ్యింది. దీనికి హిందూత్వ శక్తులు ఇతోధికంగా తోడ్పడ్డాయి. ప్రభుత్వం, పోలీసుల అండతో ‘“అరంబాయి తెన్గులొ, “’మెయితీ లూపిన్’ లాంటి హింసాత్మక మెయితీ మిలీషియా మూకలు యథేచ్చగా హింసకి పాల్పడ్డాయి.
ఇటువంటి సమయాలలో స్త్రీ శరీరం రాజకీయం కావడం సర్వ సాధారణం అయిపోయింది. ఒక సమూహానికి చెందిన గౌరవ, ప్రతిష్టలను ప్రీ శరీరంలోనే చూసే నైజం, సంస్కృతి ఈనాటిది కాదు. ప్రజల గౌరవ, మర్యాదలకు చిహ్నంగా స్త్రీ మానాన్ని చూసే భావన సమాజంలో యుగయుగాలుగా స్థిరపడిపోయింది. గొడవలు, ఘర్షణలు, వివాదాలు, యుద్దాలు… ఇలా అన్నిచోట్లా ప్రీ ప్రీ శరీరాన్ని రాజకీయ ఆయుధంగా, వేదికగా వాడుకోవడం ఆధునిక యుగంలో కూడా మానవుడు మానలేదు. బూతు మాటల, వికృత చేష్టల ద్వారా మహిళలను “అపవిత్రం” చేసి ప్రత్యర్థి సమూహాల గౌరవ, మర్యాదలను, ఐడెంటిటీని మంటగలిపామనే తత్వం పోలేదు. మణీపూర్‌లో జరిగింది అదే.
విద్వేష ప్రచారం
మెయితీలను ఎస్.టి. జాబితాలో చేర్చడాన్ని అనుమతిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిందనీ, ఆ నేపథ్యంలోనే వివాదం రగులుకుందని ఒక ప్రచారం జరిగింది. నిజానికి హైకోర్టు ఎస్.టి. జాబితాలో కలపడానికి మెయితీలు అర్హులని అనలేదు. మెయితీలు గత పదేళ్లుగా తమను కూడా ఎస్.టి. జాబితాలో కలపమని కోరుతున్నారు. కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ విషయానికి సంబంధించి మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం మెయితీల సామాజిక ఆర్థిక స్థితిగతులు, సామాజిక మూలాలకు సంబంధించిన నివేదికను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించాలి. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆ నివేదికను నాలుగు వారాల్లో సమర్ప్చించమని మాత్రమే ఇప్పుడు తాజాగా హైకోర్టు ఆదేశించింది. అది కూడా కొంత ఆందోళనకు కారణం అయివుండచ్చు గానీ హైకోర్టు ఆర్డర్ కన్నాముందే బిజెపి ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ప్రభుత్వం కుకి సమాజంలో చాలా అలజడిని సృష్టించింది. అతను 2022లో అధికారం చేపట్టింది మొదలు హిందూ మెజారిటీ మెయితీలకూ, క్రిస్టియన్ మైనారిటీలయిన కుకీలకూ మధ్య బేధాలు సృష్టించే రాజకీయాలు ఆరంభించాడు. దానిలో భాగంగా కుకీల నుండి మెయితీలకు ముప్పు ఉందనీ, కుకీల చేతుల్లో అధిక భూభాగం ఉందనీ, ఎస్.టి. రిజర్వేషన్ వల్ల కుకీలు విద్యాఉద్యోగ రంగాల్లో పైచేయి సాధించి మెయితీలను అణగదొక్షేస్తారనీ, రెండవ తరగతి పౌరులుగా మా ర్చేస్తారనీ ఎన్నో రకాలుగా మెయితీ సమాజంలో ప్రచారం చేసి వారిలో భయాందోళనలకు తెరలేపాడు. హిందుత్వవాదులు సాధారణంగా చేసేపనే ఇది.
అంతటితో ఊరుకోకుండా కుకీ ఆదివాసులను రెచ్చగొట్టే పనులు కూడా సమాంతరంగా చేశాడు. అడవుల సంరక్షణ పేరు చెప్పి, రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్నాయని చెప్పి కొన్ని కుకి ఆదివాసీ గ్రామాలను కూల్చి ఆ ప్రజలను ఖాళీ చేయించాడు. దీనికి నిరసనగా ఆదివాసులు మార్చి 10న ఆరు జిల్లాల్లో నిరసన ర్యాలీలు తీశారు. ర్యాలీలు అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగినా వారి వెనక కుకీ మిలిటెంట్ శక్తులున్నాయని ముఖ్యమంత్రి ఒక తప్పుడు అభియోగాన్ని చేశాడు. ఈ మిలిటెంట్ గ్రూపుల నాయకులంతా బయటి వారనీ, వారి నుండి మణిపూర్‌కు ప్రమాదం పొంచి వుందనే వదంతిని వ్యాప్తి చేశాడు. కుకీలు చొరబాటుదారులనీ, కొండల్లో నల్లమందు సాగుచేసే మాదకద్రవ్య వ్యాపారులనీ రెచ్చగొట్టాడు. నిజానికి ఆ అక్రమ సాగు, వ్యాపారాలు ఇరుతెగలకు చెందిన కొంతమంది చేతుల్లో ఉన్నాయి. ఏదో ఒక్కతెగవారికి చెందిన ప్రజల చేతుల్లో మాత్రమే లేవు. అంతేకాక కుకీల నిరసన ర్యాలీల అనంతరం ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరపకుండా కొంతమంది కుకీ మిలిటెంట్లతో అప్పటికే అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. ఈ రెచ్చగొట్టే చర్యలే మణిపూర్‌ను ఈనాటి దుస్థితికి దిగజార్చాయి. ఈ గొడవలు అల్లర్లుగా మారి హత్య, , అత్యాచారాలు, గృహ దహనాలు, లైగింక హింస దాకా వెళ్లాయి. ఈ దారుణకాండ రెండు నెలలకు పైబడి కొనసాగుతూనే ఉంది.
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టకపోగా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందోనన్న సమాచారాన్ని కూడా బయటకు రానీయడం లేదు. దేశంలో ఇతర ప్రాంతాల నుండి హక్కుల సంఘాలను అక్కడకు అనుమతించడం లేదు. కనీసం మీడియా వారిని కూడా రానివ్వని పరిస్థితి. మొట్టమొదటగా జాతీయ మహిళా సంఘాల నాయకులు(ఆనీ రాజా తదితరులు) జూన్ చివరి వారంలో మణిపూర్ వెళ్లి వచ్చి అవి పూర్తిగా ప్రభుత్వం చేయిస్తున్న అల్లర్లేనని ప్రకటించారు. మణిపూర్ ప్రభుత్వం వారి మీద రాజద్రోహం కేసు పెట్టింది. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో కుకీ తెగకి చెందిన ప్రొఫెసర్ హౌసింగ్ మణిపూర్ అల్లర్ల గురించి ‘ది వైర్ పత్రికతో మాట్లాడినందుకు ఇంఫాల్ జిల్లా కోర్టు ఆయనకు నోటీసులు పంపింది. మూడు నెలలుగా మారణహోమం జరుగుతుంటే బయటి ప్రపంచం అంధకారంలో ఉండిపోయింది. ఒక పథకం ప్రకారమే ఇంటర్నెట్‌ని ఆపేసి యథేచ్చగా అల్లర్లు జరగనిచ్చారా అనే అనుమానం కలగక మానదు.
దిగజారిన పరిస్థితి
పత్రికా కథనాల ప్రకారం మణిపూర్‌లో అల్లరి మూకలు పోలీసు స్టేషన్ల నుండి, రాష్ట్ర ఆయుధాగారం నుండి 4000 ఆయుధాలను లూటీ చేసాయి. ప్రభుత్వం ఇప్పటికి 650 ఆయుధాలను మాత్రమే జప్త చేయగలిగింది. మూడు వేలకు పైగా పౌరులు ఆయుధాలు కలిగి ఉన్నారని ప్రభుత్వ అంచనా. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే – కుకీ తెగకు చెందిన అధికారపక్ష బిజెపి ఎంఎల్ఏ వున్లగిన్వాల్టే అల్లరి మూకల చేతిలో తీవ్రమైన గాయాలపాలై కదలలేని స్థితిలో రెండు నెలలుగా ఢిల్లీ ఆసుపత్రిలో ఉన్నాడు. కుకీ తెగకే చెందిన బిజెపి మంత్రి నెంచ కిప్టెన్ అధికారిక నివాసాన్ని అల్లరి మూకలు దగ్ధం చేశాయి. అదే తెగకు చెందిన ఐఏఎస్ సహా ఇతర ఉన్నతాధికార్లు ఎంతోమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మణిపూర్ విడిచి పారిపోయారు.
కేవలం రెండు తెగల మధ్య కొట్లాటగా దీన్ని చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఇది ఒక బలమైన తెగ తన సామాజిక రాజకీయ ఆధిపత్యాన్ని అడ్డం పెట్టుకొని మైనారిటీ ఆదివాసీ తెగల మీద చేస్తున్న మారణకాండేననేది స్పష్టంగా తెలుస్తుంది. దీనికి అధికార బిజెపి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం హింసను వెంటనే అదుపుచేసి శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. అందుకోసం పౌర సమాజం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టాలి.
⦁ అ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వారి రాజ్యాంగ పరమైన బాధ్యతలను గుర్తించి తక్షణమే అల్లర్లను అరికట్టాలి.
⦁ ఇరు వర్గాల మధ్య శాంతిని నెలకొల్పే ప్రయత్నం చెయ్యాలి.
⦁ అ తక్షణమే హింసాత్మక మూకల నుండి ఆయుధాలను జప్త చేసుకొని అన్ని రకాల హింసకు పాల్పడిన వారిని ప్రాసిక్యూట్ చేయాలి.
⦁ ఇప్పటివరకూ జరిగిన హింసాత్మక సంఘటనలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో 51తో దర్యాప్తు జరిపించాలి.
⦁ బాధితులకు రక్షణ కల్పించి, రిలీఫ్ క్యాంపుల్లో ఆహారం, తాగునీరు, పరిశుభ్రతలాంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి.
⦁ పౌర సమాజాన్నీ మీడియా వారినీ రాష్ట్రంలోకి అనుమతించాలి.
⦁ ఇంటర్నెట్ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలి.
మానవహక్కుల వేదిక