కాసింత వయసు వచ్చిన తర్వాత కళ్ల కింద క్యారీ బ్యాగ్‌లు రావడం సహజం. అందరికీ కాదు కానీ చాలా మందికి కళ్ల కింద సంచులు వస్తాయి. వాటితో తెగ ఇబ్బంది పడుతుంటారు. కళ్ల కింద వాపు స్త్రీ, పురుష తేడా ఉండదు. ఉబ్బిన కళ్ల కారణంగా ముఖంలో తేడా వచ్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అందం తగ్గుతుంది. కళ్ల కింద క్యారీ బ్యాగులు రావడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా సరైన ఆహారం తీసుకోకపోవడం, స్కిన్‌పై కాన్సంట్రేషన్ పెట్టకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉంది. క్యారీ బ్యాగ్స్‌తో బాధపడుతున్నవారు ఓ అయిదు విధానాలను పాటిస్తే వాపు తగ్గి చర్మం మామూలు స్థితికి వస్తుంది. ఇందులో మొదటిది మసాజ్. మసాజ్ వీపు, తలకు మాత్రమే ఉంటుందనుకుంటారు చాలా మంది. కాకపోతే ఫేషియల్ రోలర్, కూలింగ్ ఐ రోలర్ వంటికి కూడా ఉంటాయి. పడుకునే ముందు వీటితో కళ్ల చుట్టూ మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల చర్మానికి ఉపశమనం కలుగుతుంది. చర్మం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. కళ్ల కింద వాపులు నెమ్మదిగా మాయమవుతాయి.
కళ్ల కింద వాపు రావడానికి ఉప్పు కూడా కారణమే. ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిలిచి ఉంటుంది. దాంతో చర్మం వాచినట్టు కనిపిస్తుంది. కళ్ల కింద కూడా ఇలా జరిగే ఛాన్సుంది. కాబట్టి ఉప్పును వీలైనంత తగ్గించుకోవడం బెటర్. అలాగే రాత్రి పడుకునే ముందు మొహానికి ఎలాంటి మేకప్ ఉండకూడదు. మేకప్ తీసేసిన తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి. మేకప్ తీసేయకపోతే మస్కారా, లైనర్ వంటి వాటిలో ఉండే అవశేషాలు కంటిలో చిక్కుకుంటాయి. దీని వల్ల కళ్ల నుంచి నీరు కారుతుంటుంది. కళ్ల కింద ఉబ్బినట్టు కనిపిస్తుంది. కళ్ల కింద స్కిన్ చాలా సెన్సిటివ్. అందుకే హాని కలిగించని క్రీములను వాడితే మంచిది. కళ్ల కింద క్యారీబ్యాగులను తగ్గించడానికి వోట్రే ఐ క్రీమ్‌ను వాడాలి. సరిపడనంత నిద్ర లేకపోవడం వల్ల కూడా కళ్ల కిందటి చర్మం ఉబ్బుతుంది. రోజుకు ఏడేనిమిది గంటల నిద్ర చాలా అవసరం. అదే పనిగా టీవీ చూడటం, సెల్‌ఫోన్‌ను వదలకపోవడం, ల్యాప్‌ట్యాబ్ ముందు గంటల తరబడి కూర్చోవడం తగ్గించాలి. వీటిని కచ్చితంగా పాటిస్తే కళ్ల కింద వాపులో ఆటోమాటిక్‌గా తగ్గిపోతాయి.