
మైండ్ ఫుల్ ఈటింగ్.. ఇపుడు చాలామంది నోటి నుంచి తరచూ వింటున్న మాట ఇది. మైండ్ ఫుల్ ఈటింగ్ అంటే చాలామంది అనుకుంటున్నట్టు ప్రొటీన్లు, కాలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్, ప్రొటీన్లు ఎంత తీసుకోవాలనే లెక్కాపక్కలకు సంబంధించిది కాదు. మనం ఏమి తింటున్నామన్న దానిపై మనసు పెట్టడమే.. .తీసుకుంటున్న ఆహారం యొక్క మంచి చెడుల బేరీజులు, పరిశీలనలతో సంబంధం లేకుండా వ్యక్తులు తాము తింటున్న ఆహారం వారికిచ్చిన ఆనందం, ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ అప్రమత్తతతో వ్యవహరించడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే తినేటప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోకుండా ఉండడం. వ్యక్తులుగా మిమ్మల్ని మీరు సంపూర్ణంగా మలుచుకోవడం. మీకేం కావాలో తెలుసుకోవడం.

జెన్ బుద్ధిజం నుంచి వచ్చిన ఒక సాధనా ప్రక్రియ ఈ మైండ్ ఫుల్ నెస్ మెథడ్. ఇది స్వీయ ప్రశాంతతను పొందేందుకు మంచి మార్గంగా ఎంతో పాపులర్ అయింది. అలాగే ఈటింగ్ బిహేవియర్స్ ను మార్చుకోవడానికి అనుసరించే ఒక మంచి మెథడ్ కూడా. ప్రవర్తనాపరమైన మార్పులకు సంబంధించిన కార్యక్రమంలో సైతం దీన్ని అంతర్భాగం చేశారు. డైటరీ బిహేవియర్ ఛేంజెస్ కూడా ఇందులో అంతర్భాగం చేయడం ఒక న్యూట్రెండ్.

నిద్రలేస్తే వాడే పదం ఇది
నిత్యజీవితంలో పొద్దున్న లేచినప్పటి నుంచి మనం మాట్లాడే భాషలో మైండ్ ఫుల్నెస్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటాం. కానీ ఈ పదం అర్థాన్ని ఉపరితలం నుంచి తీసుకోకూడదు. అంటే పైపైగా మాత్రమే దీని అర్థాన్ని తీసుకోకూడదు. నిజానికి దీనికి ఎంతో లోతైన అర్థమే ఉంది. కానీ అంత లోతులకంటా పోకుండా సింపుల్గా చెప్పాలంటే వ్యక్తులు ఎవరికి వారు తమ గురించి తాము పట్టించుకోవడం. ఆడ లేదా మగ ఎవరైనా సరే ఇండివిడ్యువల్ గా తమపై తాము శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని వెల్లడిస్తోంది. అలాగే మైండ్ ఫుల్ ఈటింగ్ కూడా మన ఆహారపు అనుభవాలపై వ్యక్తులు అవగాహనతో వ్యవహరించడాన్ని ఇది ప్రోత్సహిస్తుందని చెప్పొచ్చు. ముందే చెప్పినట్టు మైడ్ ఫుల్ ఈటింగ్ ఉద్దేశం శరీర బరువును తగ్గించుకోవడం కాదు. తాము తినే ఆహారం విషయంలో వ్యక్తులు అవగాహనతో ఉండడమే ఇందులోని అసలు అంతరార్థం. ఆహారాన్ని సంపూర్ణ స్వస్తతతో, ఆనందంతో, ఛాలెంజింగ్ గా, పాజిటివ్ గా కూడా వ్యక్తులు తమకితాము ఆస్వాదించ గలగడమే ఈ విధానంలోని వెన్నుముకాంశం. అయితే మైండ్ ఫుల్ ఈటింగ్ అనేది బరువు తగ్గడానికి సంబంధించినది కాకపోయినా ఈ విధానాన్ని అనుసరిస్తున్న వాళ్లు బాగా బరువు తగ్గడం ఇందులోని ఒక ఆసక్తికర అంశం. పరిశోధకులకు, ఆరోగ్యనిపుణులకు అంతుచిక్కని పజిల్.

డైట్స్ విషయానికి వస్తే ఎలా తినాలనే నియమావళి మీద మనం ప్రధానంగా దృష్టి నిలుపుతాము. కొన్ని నిర్దిష్టమైన ఫలితాలను అంటే బరువు తగ్గడం, మధుమేహ వ్యాధిగ్రస్తులైతే బ్లడ్ షుగర్ నియంత్రించడం వంటివి ఆశిస్తాం. అయితే ప్రవర్తనాపరమైన మార్పులతో వచ్చే ఫలితాలు అంత తొందరగా కనిపించవు కాని నిర్మాణాత్మకమైన, వ్యక్తిగతమైన సంపూర్ణ ఫలితాలను ఆలస్యంగా నైనా ఇస్తాయనడంలో సందేహం లేదు. మిగతా వాటిల్లా ఎలాంటి ఆరోగ్య ఫలితాలు వెంటనే ఇందులో కనిపించవు. వ్యక్తుల్లో ప్రవర్తనాపరమైన మార్పుల సాధనా ప్రయత్నంలో ఇలా ముందుకు సాగడం అనుకున్నంత సులభం కాదు. ఎందుకంటే ప్రవర్తనా పరమైన మార్పులు మనం నిత్యం ఎదుర్కొనే రకరకాల ఒత్తిళ్లు, ప్రెషర్ల మీద ఆధారపడి ఉంటాయి. ఆ కష్టాలను తట్టుకుని ప్రవర్తనాపరమైన మార్పులతో నిండుగా నిలబడ్డం కష్టమైన, ఎంతో టైమ్ పట్టే విషయం కూడా.

ప్రవర్తనలో, అలవాట్లల్లో ఎంతో మార్పు:
మైండ్ ఫుల్ ఈటింగ్ మనుషుల ప్రవర్తనలో సైతం ఎంతో మార్పును తెస్తుంది. ఏం తినాలి? ఎంత తినాలి అనేది వ్యక్తి తనకు తాను ఆలోచించుకోవాలి. ఎంచుకోవాలి. మైండ్ ఫుల్ అప్రోచ్ తో . మైండ్ ఫుల్ ఈటింగ్ ఉంటుంది. ఇలా చేసే పనిలో ఆలస్యంగానైనా ఎప్పుడూ మంచి ఫలితాలే కనిపిస్తాయి. మైండ్ ఫుల్ ఈటింగ్ అలాంటిదే. అలా తినే ఈటింగ్ నిజానికి ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది కూడా. అంతేకాదు ఇందులో వ్యక్తులు ఎలాంటి జడ్జిమెంట్లతో పనిలేకుండా తాము తినేదాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు తాము తినే ఆహారపదార్థాలు తాము కోరుకునే ఆరోగ్య ప్రయోజనాలు అందించేలా ఉండేలా చూసుకుంటారు. మైండ్ ఫుల్ ఈటింగ్ అనుసరించడం వల్ల డయాబెటిస్ వంటి వాటిల్లో మార్పులు చూడగలం. వ్యక్తుల ఈటింగ్ బిహేవియర్ లో మార్పులను చూడగలం. అందుకే ఈటింగ్ బిహేవియర్స్ కోసం మైండ్ పుల్ నెస్ ను రికమెండెడ్ మార్గంగా నేడు ఎందరో సూచిస్తున్నారు.

డైట్ విషయంలో మైండ్ ఫుల్ అప్రోచ్ ను అనుసరిస్తూ చేసిన 19 స్టడీల్లో 13 స్టడీలో బరువు తగ్గడంలో మంచి ఫలితాలు కనిపించాయని తేలింది. మైండ్ ఫుల్ ఈటింగ్, బరువు తగ్గడానికి మధ్య ఉన్న సంబంధాన్ని పట్టుకోవడంలో ఈ స్టడీలు నిర్వహించిన పరిశోధకులు వైఫల్యం చెందారు. అందుకే ఈ రిండింటి మధ్య ఉన్న సంబంధంపై మరిన్ని అధ్యయనాలు జరగాలని వారు అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి అర్థం అవుతున్నదేమిటంటే మైండ్ ఫుల్ ఈటింగ్ వల్ల బరువు తగ్గడం సాధ్యమవుతోంది. అలాగే మైండ్ ఫుల్ ఈటింగ్ అనుసరించాలంటే ఎంతో ఓర్పు కూడా అవసరం. ఇందులో సెల్ఫ్ ట్రస్టు కూడా చాలా ఆవశ్యకం. వ్యక్తులకు వారి మీద, వారి నిర్ణయాల మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. వివిధ ఆహారాలపై తమ అభిప్రాయాలను, వాటిపై తమ స్పందనలను వ్యక్తులు తమకు తాము గుర్తించగలిగినపుడు, ఫుడ్ గురించి తమకు తాము అప్రిషియేట్ చేసుకోగలిగినపుడు ప్రతి వ్యక్తి తమను తాము ‘యాక్సెప్టు’ చేసుకోగలుగుతారు. అప్పుడు వారికి తమ అభిప్రాయాలను, నమ్మకాలను విశ్వసించగలగడం కష్టం కాదు. తినే ఫుడ్ లోని పాజిటివ్ అంశాలను అంగీకరించడం లేదా తమకు నచ్చని టేస్టు గురించి ఛాలెంజింగ్ గా ఆలోచించగలిగితే, స్పందించగలిగితే ఆ యాక్సెప్టెన్స్ వ్యక్తులకు ఇచ్చే చొరవ, వారిని ముందుకు నడిపించే తీరు భిన్నంగా ఉంటుంది. వ్యక్తుల అభిప్రాయాలు, అనుభవాలు, ఆలోచనలు, నమ్మకాల భూమికగా మైండ్ ఫుల్ ఈటింగ్ అందించే ప్రవర్తనాపరమైన ఫలితాలు, శరీరానికి అది అందించే ఆరోగ్యం కూడా ఎంతో.

ఇది సాధిస్తే ఏదీ అసాధ్యం కాదు:
మైండ్ ఫుల్ నెస్ ను సాధించగలిగితేవ అసాధ్యం అనేదే ఉండదు. మైండ్ ఫుల్ ఈటింగ్ అంత:సూత్రం కూడా అదే. కాకపోతే ఇందులో వ్యక్తుల వ్యక్తిగత ప్రయాణాలు, అనుభవాలు, విశ్వాసలు, ఛాలెంజింగ్ నిర్ణయాలు, పాజిటివ్ అడుగులు కీలక పాత్ర వహిస్తాయి. దీన్ని సాధించాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. నిత్యం మైండ్ ఫుల్ నెస్ మెడిటేషన్ చేయాలి. ఇందులో మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ ఉంటుంది. అలాగే యోగ, మైండ్ ఫుల్ వాకింగ్ చేయడం, వారంలో పలుమార్లు మైండ్ ఫుల్ ఈటింగ్ చేయడం వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి. వీటిని అనుసరించడం ద్వారా జీవితంలో ప్రతి క్షణం మైండ్ ఫుల్ అప్రోచ్ ను ఫాలో అవగలం. దీంతో ఎలాంటి జడ్జిమెంట్లతో పనిలేకుండా ప్రశాంతంగా ఉంటూ ప్రతి క్షణాన్ని వ్యక్తులు ఆస్వాదించగలుగుతారు. వీళ్లు తినే ఆహారం నుంచి ప్రతి విషయంలోనూ వ్యక్తిగతంగా పాల్గొనగలుగుతారు. ఫిజికల్ హంగర్, ఎమోషనల్ హంగర్ కు ఉన్న తేడాలు గుర్తించగలుగుతారు కూడా. ఫలితంగా వ్యక్తుల్లో ఉండే డిజార్డర్డ్ ఈటింగ్ బిహేవియర్ తగ్గుతుంది. బరువు తగ్గుతారు. మైండ్ ఫుల్ ఈటింగ్ ద్వారా ఆహారపు అలవాట్లను ఉల్లాసమైన, క్రమపద్ధతితో ఉండేలా పెట్టుకోగలుగుతారు. మ్యానేజ్ చేసుకోగలుగుతారు.
ఒక్కమాటలో చెప్పాలంటే మైండ్ ఫుల్ ఈటింగ్ అనేది మైండ్ ఫుల్ నెస్ భూమికగా ఉంటుంది. ఈ మైండ్ ఫుల్ నెస్ ఒకరకమైన ధ్యాన పద్ధతి. దీని ద్వారా వ్యక్తులుగా మీ ఎమోషన్స్ తో పాటు మీకు ఏమి కావాలన్నదానిని కూడా గుర్తిస్తారు. మీ బలహీనతలను అధికగమిస్తారు. మైండ్ ఫుల్ నెస్ సహాయంతో ఒత్తిడి, యాంగ్జయిటీ, ఈటింగ్ డిజార్డర్లు, ఫుడ్ కు సంబంధించిన వ్యక్తుల రకరకాల ప్రవర్తనలు, స్పందనలు వంటి వాటినీ నివారించవచ్చు.

మైండ్ ఫుల్ నెస్ తోనే సాధ్యం:
మైండ్ ఫుల్ ఈటింగ్ లో అంతర్గతంగా కనిపించే కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిల్లో అన్నం తినేటప్పుడు వ్యక్తులు మెల్లగా తినడం ఒకటి. వీరిలో మెదడుగాని, వారి ఆలోచనలుగాని ఎలాంటి పక్కదార్లు పట్టవు. ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. భౌతికమైన ఆకలిని గుర్తిస్తారు. కడుపునిండే వరకూ తింటారు. తినాలన్న ఇచ్ఛ కు నిజంగా ఆకలి కారణమా కాదా అనే విషయాన్ని కూడా వీళ్లు గుర్తించగలరు. అంతేకాదు భౌతిక స్థాయిలో ఆనందాన్ని ఇచ్చే అనుభూతులను ఆనందించగలరు. ఉదాహరణకు రంగులను గుర్తించగలరు, వాసనలను ఆస్వాదించగలరు. రుచులను ఎంజాయ్ చేయగలరు. శబ్దాలను, టెక్స్చర్లను అనుభూతి చెందగలరు. ఫుడ్ కు సంబంధించిన గిల్ట్ , యాంగ్జియిటీ వంటి భావనలను అధిగమించగలరు. శరీర ఆరోగ్యం బాగుండేలా ఆహారపు అలవాట్లను అనుసరించగలరు. అంతేకాదు శరీరంపై, మానసిక అనుభూతులపై ఫుడ్ ప్రభావాన్ని గుర్తించగలరు. వ్యక్తులు తాము తిన్న ఫుడ్ ను మననసారా అప్రిషియేట్ చేయగలరు. అంతేకాదు తమకు నచ్చని వాటిని ఛాలెంజింగ్ కూడా చేయగలరు. ఇవన్నీ కూడా మైండ్ ఫుల్ ఈటింగ్ లో అంతర్భాగమై ఉన్నాయి. ఇవన్నీ కూడా మైండ్ ఫుల్ నెస్ తోనే సుసాధ్యమవుతాయి.