
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అల్లిరాజపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెన్త్ స్టూడెంట్ అఖిల్ (14) మృతి చెందాడు.
జగదేవపూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి వెంకటేశం కుమారుడు అఖిల్ (14) అల్లిరాజపేట లోని సెయింట్ విన్సెంట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. ఇంటి నుండి పాఠశాలకు ద్విచక్ర వాహనంపై వెళుతూ గజ్వేల్ వైపు నుండి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు