నేషనల్ హెల్త్ మిషన్ అండ్ హెచ్ఎం స్కీములో దాదాపు 15 వేల మంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిన వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తున్నారని గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న వీరందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కోఠిలోని కమిషనర్ కార్యాలయం ముందు వందలాదిమంది కార్మికులతో మహాధర్నను నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నేతలు మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్లో పీహెచ్ఎం స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టులు, అకౌంటెంట్స్, సపోర్టింగ్ స్టాఫ్, ముగ్గురు మెడికల్ అసిస్టెంట్/ ఎంఎన్ఓ, వాచ్మెన్, స్వీపర్, బస్తీ దవఖానా స్టాఫ్‌నర్స్, సపోర్టింగ్ స్టాఫ్, బ్లడ్ బ్యాంకు డీఈఓ, ల్యాబ్ అటెండర్, ఎస్ఎన్సియూడి ఈఓ, సెక్యూరిటీ గార్డ్స్, టీ-హబ్ మేనేజర్, డిఈఓ సపోర్టింగ్ స్టాఫ్, బ్లాక్ లెవెల్ అకౌంటెంట్స్, ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంలు, ఔట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులు, ఎన్అర్సి. న్యూట్రిషన్ కౌన్సిలర్, సెక్యూరిటీ గార్డ్, సపోర్టింగ్ స్టాఫ్, పిహెచ్సి డి.ఓ, కాంటిజెంట్ వర్కర్స్, డిఐఇసి సైకాలజిస్ట్, డెంటిల్ టెక్నీషియన్, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, సోషల్ వర్కర్, అప్తోమేట్రిస్ట్, ఫిజియోథెరపిస్టులు, ఎంసిహెచ్ ఓటీ అసిస్టెంట్ / ఓటీ టెక్నీషియన్, సెక్యూరిటీ గార్డ్, సపోర్టింగ్ స్టాఫ్, ఆయుష్ ఎస్ఎన్ఓ / ఎఫ్ఎన్ఓ, ఎస్‌టిఎల్‌ఎస్, టిబి లెప్రసీ వింగ్ ఆల్ సూపర్వైజర్స్, ఆర్బిఎస్కె ఫార్మాసిస్టులు, ఎఎన్ఎమ్లు లాంటి అనేక క్యాడర్ల సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం చట్టం ప్రకారం జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
అధికారులు విడుదల చేసిన 510 జీవో ద్వారా వీరికి తీవ్ర నష్టం జరిగిందని, చట్ట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ వేతనం ఈ సిబ్బందికి అమలు చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు.
ఎన్ హెచ్ ఎం స్కీములో పనిచేస్తున్న డాక్టర్లను ఏ మాదిరిగా రెగ్యులరైజ్ చేశారు అదే మాదిరిగా మిగతా క్యాడర్ సిబ్బంది అందరిని కూడా క్రమబద్ధీకరించాలని లేనిపక్షంలో రాబోవు రోజులు సమ్మెతో సహా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాలసుబ్రమణ్యం, బాపు యాదవ్, సుమన్, నరసింహ, రేవతి, నీలం, మీనాక్షి రజిత జయలక్ష్మి భవాని బాలకృష్ణమ్మ పావని సునీత అనిత సాగర్ జైపాల్ శైలు వరలక్ష్మి, ప్రసన్నకుమారి తదితరులు పాల్గొన్నారు