
కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు చేస్తున్న ఆందోళన కు మద్దతు పలికితే ప్రజల పక్షాన ఆలోచించాల్సిన పాలకులు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి నియంత ల ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రియాజ్ ను మఫ్టీ పోలీసులు తన కోచింగ్ సెంటర్ లో అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదన్నారు. ఉదయం ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారన్నారు. విద్యార్థుల పక్షాన ప్రజాస్వామిక పోరాటం చేస్తున్న నాయకులను అరెస్టులు చేయడం అక్రమమన్నారు. వారిని వెంటనే విడుదల చేయాని డిమాండ్ చేశారు. గ్రూప్ 2 విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన, విద్యార్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.