కరీంనగర్ సిటీలోని తీగలగుట్టపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల తాళాలు పగలగొట్టి నిరుపేద మహిళలు ఆక్రమించిన సంఘటన గురువారం ఉదయం జరిగింది. అనంతరం వారు ఆ ఇండ్లలోనే భోజనాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణం పూర్తయి ఏళ్లు గడిచినా ఇండ్లు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని వెళ్లిపోవాలని హెచ్చరించినా పట్టించుకోలేదు. దీంతో అరెస్ట్ చేసేందుకు యత్నించగా తమను అడ్డుకోకుండ కత్తులు మెడపై పెట్టుకుని, పురుగుల మందు డబ్బాలు తాగుతామని బెదిరించడంతో కలకలం రేగింది. ఈ క్రమంలో పోలీసులు, మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు భారీగా చేరుకుని వారిని బలవంతంగా లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. గతంలోనూ ఇదే తరహాలో డబుల్ బెడ్ రూమ్లను మహిళల ఆక్రమించుకోగా పోలీసులు బయటకు పంపించారు.