
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఅర్ చేసి అటుగా వెళ్తున్న డాక్టర్ కాపాడి ప్రాణాలు కాపాడిన సంఘటన కొడిమ్యాల మండల కేంద్రంలో జరిగింది. గురువారం ఉదయం మండల కేంద్రంలోని అంగడి బజార్ ప్రాంతంలో మల్యాల మండలానికి చెందిన ఓ వ్యక్తి ఫిట్స్ రావడంతో స్వల్ప గుండెపోటుకు గురై రోడ్డు పక్కన పడిపోయాడు. నోటి నుండి రక్తం కారుతుండటంతో స్థానికులు అంబులెన్స్‌కు కాల్ చేసారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న స్థానిక పీహెచ్సీ డాక్టర్ నరేష్ గమనించి పేషెంట్‌ను పరిశీలించారు. హార్ట్ బీట్ అబ్నార్మల్గా ఉండటం, బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండటం గమనించి సీపీఆర్ చేయడంతో పేషెంట్ స్పృహలోకి వచ్చాడు. తర్వాత 108 అంబులెన్స్‌లో ట్రీట్మెంట్ కోసం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడిన డాక్టర్ నరేష్‌ను స్థానికులు అభినందించారు.