
‘‘పవన్ నా విషయంలో వ్యవహరించిన తీరు తప్పే. ఆయన నాకు అన్యాయం చేశారు నిజమే. కానీ ఆయన డబ్బు మనిషి కాదు. మంచోడు” అని పవన్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ అన్నారు. ఆమె ఈ విషయంలో వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవన్‌కు రాజకీయంగా తన మద్దతు ఉంటుందన్నారు. ఆయన సమాజానికి, పేదవాళ్లకు మంచి చేయాలనుకుంటున్నారన్నారు. అందుకే కుటుంబాన్ని పక్కన పెట్టినట్లు చెప్పారు. పవన్‌కు మూడు పెళ్లిళ్లు అని అన్నప్పుడల్లా తన మనస్సు చివుక్కుమంటుందన్నారు. దయచేసి తనను, తన పిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకురావొద్దన్నారు. వెబ్ సిరీస్‌లో తమను ఇన్వాల్వ్ చేవద్దని చెప్పారు.