
‘మూల్ నివాసీ బచావో మంచ్’ ఇది ఛత్తిస్ఘడ్ ఆదివాసీల నినాదం. ఆ నినాదానికి అర్థం ఆదివాసీల మనుగడని కాపాడాలని. ఈ పిలుపుతో సుక్మా జిల్లా గొంపాడు అటవీ ప్రాంతంలో మావోయిస్టు సానుభూతిపరులు మావోయిస్టు పిలుపుమేరకు ఆదివాసి గిరిజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఆదివాసి దినోత్సవంలో గొంపాడు గ్రామ ఆదివాసీ ప్రజలు వాళ్ల సాంస్కృతిక నృత్యాలతో, కొమ్ము డ్యాన్సులతో ఆదివాసి దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ ఏడాది ఆదివాసి దినోత్సవాన్ని మూల్ నివాసి బచావో మంచు అనే నినాదంతో జరుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మావోయిస్టులు కూడా పాల్గొన్నారనే సమాచారంతో పోలీసు నిఘా వర్గాలు అంటున్నాయి.