
తెలంగాణ రాష్ట్ర కంట్రీ బ్యాటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఇటీవల జూలై 16న ప్రారంభించిన పాత పెన్షన్ సాధన సంకల్పయాత్ర ముగింపు మహాసభను ఛలో హైదరాబాద్ పేరిట ఆగస్టు 12న పాత పెన్షన్ సాధన సాకర సభ ను ఎగ్జిబిషన్ గ్రౌండ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్ లోకేంద్ర కార్యాలయంలో ప్రకటించారు. ఈ రోజు నాంపల్లిలోని క్రిమినల్ కోర్టులో ఆగస్ట్ 12 చలో హైదరాబాద్ సన్నాహక సమావేశం జ్యూడిషల్ జాతీయ అధ్యక్షులు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ మరియు రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ మాట్లాడుతూ ఇటివల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్. యెస్.డి.ల్ తో ఒప్పందాన్ని ధిక్కరించి నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి తమ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేస్తామని ప్రతి ప్రభుత్వం నూతన పెన్షన్ విధానం అంగీకార యోగ్యం కాదని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని రాజస్థాన్, ఛత్తీస్గడ్ ,జార్ఖండ్ ,పంజాబ్ , హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయన్నారు. ఆగస్టు 12 న జరిగేటటువంటి సభకు దేశంలోని సిపిఎస్ రద్దు చేయబడినటువంటి రాష్ట్రాల సిపిఎస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరవుతారని మరియు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించామన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి 1,72,000 సీపీయస్ ఉద్యోగ ఉపాధ్యాయులు తో పాటు పాత పెన్షన్ లో ఉన్న ఉద్యోగ,ఉపాధ్యాయులు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరాకుల శీను, మ్యాన పవన్, కోటకొండ పవన్, మల్లికార్జున్,రోషన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్ రావు ,నటరాజ్ లు పాల్గొన్నారు.