
మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. జయప్రద థియేటర్లో పని చేసే వారికి ఈఎస్ఐ చెల్లించనందునే కోర్టు ఈ తీర్పు వెలువరించింది. చెన్నైకి చెందిన రామ్‌కుమార్, రాజబాబు అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి జయప్రద అన్నారోడ్డులో ఓ సినిమా థియేటర్ నడిపించారు. ఆ థియేటర్లో పని చేసే కార్మికుల జీతాల నుంచి ఈఎస్ఐ డబ్బులు కట్ చేసి తిరిగి వారికి చెల్లించలేదని కార్మిక బీమా కార్పోరేషన్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు విచారణ జరిపిన ఎగ్మోర్ కోరు జయప్రదతోపాటు మరో ముగ్గురికి ఐదు వేల రూపాయల జరిమానాతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది.