
ధరణి పోర్టల్‌పై సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో పోస్టర్ విడుదలైంది. అందులో పేర్కొన్న విషయాలు ఇలా ఉన్నాయి.. ధరణి పోర్టల్ గ్రామీణ భూస్వాములకు వరంగా మారింది. తెలంగాణలో దొరలగడీలు, కొత్త రంగులు దిద్దుకునేలా ధరణి పోర్టల్ సహకరిస్తున్నది. ప్రజాస్వామిక తెలంగాణ కొరకు మరొక ఉద్యమాన్ని నిర్మించ వలసిన రాజకీయ కర్తవ్యం యువత ముందు ఉంది. ధరణి పోర్టల్ రద్దుకు యువత పోరాడాలి. బీజేపీ నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడండి. బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజంను ప్రతిఘటించండి. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా పోరాడండి. జగిత్యాల, సిరిసిల్ల జైత్యయాత్ర లాంటి వాస్తవిక పునాదుల మీద నిర్మించబడ్డ ప్రా ఉద్యమాల చరిత్రను, ప్రజా విముక్తి పోరాటాలను, అమర వీరుల ప్రాణ త్యాగాలను, ఆశయాలను అధ్యయనం చేయండి. ఆ ప్రజామార్గంలో నడవండి.