
లోక్‌సభలో మూడు కీలక బిల్లులు
లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. పౌరుల సంరక్షణకు సంబంధిచిన ఈ బిల్లులు క్రిమినల్ చట్టాల్లో భారీ మార్పులు తెస్తాయి. క్రిమినల్ చట్టాల్లో కేంద్రం మొత్తం 313 మార్పులను తీసుకొచ్చింది. ఎవిడెన్స్ యాక్ట్‌ను భారతీయ సాక్ష్య బిల్లుగా కేంద్రం మార్చనుంది. సీఆర్పీసీ బదులుగా భారతీయ న్యాయ సంహిత అనీ, ఐపీసీ బదులుగా భారతీయ నాగరిక్ సురక్ష సంహితను ప్రతిపాదించింది. మహిళల రక్షణ, మూక దాడులపై తీసుకోవాల్సిన యాక్షన్‌ను డిస్కషన్ సందర్భంగా చర్చించారు. గ్యాంప్ రేప్‌కు పాల్పడిన వారికి శిక్షను 20 ఏళ్లకు పెంచారు. మైనర్లపై అత్యాచారం, మూక దాడులకు పాల్పడిన వారికి మరణ శిక్షని విధించనున్నట్లు బిల్లులో పొందుపరిచారు. ఈ ఎఫ్ఐఆర్ను దేశంలో ఎక్కడైనా నయోదు చేసేలా మార్పు తెచ్చారు. బిల్లులపై మరింత చర్చ కోసం నివేదికను కేంద్రం స్టాండింగ్ కమిటీకి పంపింది. ‘‘దేశంలో నేరాలు అరికట్టే రీతిలో శిక్షలుంటాయ’’ని అమిత్ షా సభలో అన్నారు.