
77వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా థ్రిల్ సిటీ, నెక్లెస్ రోడ్డులో జరిగిన అద్వితీయమైన ‘ట్రై కలర్ వాక్’ జరిగింది. ఇందులో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతోపాటు గుంటూరు, ప్రకాశం, జిల్లాల రోటేరియన్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథి ఆర్ఐ డిస్ట్రిక్ట్ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బుసిరెడ్డి శంకర్ రెడ్డి వంద మీటర్ల జాతీయ జెండాతో మానవ హారం ర్యాలీని ప్రారంభించారు. దేశం గత 76 సంవత్సరాలలో విశేషమైన విజయాలను జరుపుకుంటున్నందున ఈ క్షణం ఎంతో గర్వం,ఆనందంతో నిండి ఉందని బుసిరెడ్డి ఈ సందర్భంగా అన్నారు. స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన వీరు త్యాగాలు, అంకితభావం, అచంచలమైన సంకల్పం గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.