రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కల్లు తాగారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటిస్తుండగా మార్గ మధ్యంలో బురాన్ పల్లి వద్ద ఒక గీత కార్మికుడు కల్లు తీస్తున్న విషయం మంత్రి గమనించారు. వెంటనే వాహనాన్ని ఆపారు. గీత కార్మికుడు మంత్రిని కల్లు తాగమని అడుగగా ఎర్రబెల్లి రుచి చూశారు.