
భారత దేశమంతా స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు కన్నుల పండగగా జరుగుతున్న వేళ ఈ రోజు నాంపల్లిలోని ట్రెసా కేంద్ర కార్యాలయంలో 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్బంగా ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలితo గానే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని , వారు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావంచి దేశం కోసం పోరాడారని,అలాగే అనునిత్యం సైనికులు దేశరక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారని వారందరికీ మనం రుణపడి ఉంటామని వారి సేవలను కొనియాడారు. కే గౌతమ్ కుమార్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యత గల పౌరులుగా దేశం కోసం, సమాజం కోసం పని చేయాలని వారు పిలుపు నిచ్చారు.ఈ సందర్బంగా రెవెన్యూ ఉద్యోగులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ CCLA యూనిట్ అధికారులు శ్రీమతి సబితా శ్రీమతి దుర్గ వసంత లక్ష్మి గంగాధర్ రామకృష్ణ మరియు ఇతర అధికారులు లతో పాటు అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షులు కె. నిరంజన్ రావు, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి,ఆర్గనైసింగ్ సెక్రటరీ నజీమ్ ఖాన్ సైదులు సిసియల్ఎ యూనిట్ అధ్యక్షులు ఎల్లారెడ్డి, కార్యదర్శి మూర్తుజా, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కె. రామకృష్ణ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.